ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్... విమాన టికెట్ ధరలు, హోటల్ రేట్లు అదరహో!
- ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌తో కిటకిటలాడుతున్న అహ్మదాబాద్
- ఆకాశాన్నంటిన విమాన, హోటల్ టికెట్ల ధరలు
- ఫ్లైట్ టికెట్ ధరలు రూ. 35,000 వరకు పెరుగుదల
- హోటల్ గదుల అద్దెలు రూ. 36,000 దాటిన వైనం
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ నగరం సర్వం సిద్ధమైంది. ఆదివారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక పోరును వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో నగరం మొత్తం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతుండగా, విమాన టికెట్లు, హోటల్ గదుల ధరలు ఆకాశాన్నంటాయి.
సాధారణ రోజులతో పోలిస్తే అహ్మదాబాద్‌కు వెళ్లే విమానాల టికెట్ ధరలు గణనీయంగా పెరిగాయి. కొన్ని మార్గాల్లో టికెట్ ధర రూ.17,000 నుంచి రూ.35,000 వరకు పలుకుతోంది. మరోవైపు హోటల్ రంగం కూడా భారీ డిమాండ్‌ను చవిచూస్తోంది. సాధారణంగా రూ.8,000 నుంచి రూ.10,000 మధ్య ఉండే హోటల్ గదుల అద్దెలు ప్రస్తుతం రూ.25,000 నుంచి రూ.36,000కు చేరాయి. ముఖ్యంగా మొతేరా, గాంధీనగర్ సమీపంలోని హోటళ్లన్నీ దాదాపుగా ఫుల్ అయ్యాయి.
హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అంచనాల ప్రకారం, ఫైనల్ మ్యాచ్ కారణంగా కేవలం రెండు రోజుల్లోనే నగరంలోని హోటల్ పరిశ్రమకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది. ఈ ప్రభావం కేవలం హోటళ్లకే పరిమితం కాకుండా రవాణా, రెస్టారెంట్, పర్యాటక రంగాలకు కూడా విస్తరించింది.
నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే భారీ క్రీడా ఈవెంట్లు నగర ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తున్నాయని, వేలాది మందికి తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని స్థానిక వ్యాపార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.